AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ ములకలపల్లి /ఆగస్టు 21/ అక్షరం న్యూస్: గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కమలాపురం గ్రామంలో ‘నేను సైతం చేయూత విద్యా యాత్ర మన ఎమ్మెల్యే మన బడి’ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నూతన బోరువెల్, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాలలోని వసతులు, విద్యాబోధనను పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించి, వారితో కలిసి తింటూ ఆప్యాయంగా మాట్లాడారు. వారి భవిష్యత్తు లక్ష్యాలపై ఆరా తీస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సర్పంచ్ వగ్గెల రాధ, ప్రధానోపాధ్యాయులు చింత బుచ్చిరాములు, వార్డెన్ నాగప్రత్యూష, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily