Thursday, 15 January 2026 07:50:09 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా మున్సిపాలిటీ అభివృద్ధి నా లక్ష్యం* *మున్సిపాలిటీ అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులైన తీసుకొస్తా* *వైరా మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్ మున్సి

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 04 January 2026 04:54 PM Views : 468

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/ జనవరి 4 వైరా (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీలోని 20 వార్డులలో సుమారు 17 కోట్ల రూపాయల నిధుల మంజూరుతో మునిసిపాలిటీలోని 20 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాలు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నిర్వహించారు. శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి ముందు వైరా రింగ్ రోడ్డు సెంటర్ నందు స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పూలమాల వేశారు అనంతరం వైరా రిజర్వాయర్ అలుగుల వద్ద దాసాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి. రిజర్వాయర్ విద్యుత్ సబ్స్టేషన్ నుండి దాసాంజనేయ స్వామి దేవాలయం వరకు సుమారు కోటి రూపాయల నిధులు మంజూరు తో సిసి రోడ్డు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే రింగ్ రోడ్డు సెంటర్ నందు మినీ ఫౌంటైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే కూరగాయల మార్కెట్ వద్ద సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. అలాగే అలాగే జాలాది రామకృష్ణ వాటర్ సర్వీసింగ్ సెంటర్ వద్ద నుండి కె వి సి యం డిగ్రీ కాలేజ్ మీదుగా కమ్మవారి కల్యాణ మండపం వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వైరా మున్సిపాలిటీలోని 20 వార్డులలో సిసి రోడ్లు సైడే నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే రామదాసు నాయక్ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ అభివృద్ధి తన లక్ష్యమని మున్సిపాలిటీ అభివృద్ధికి ఇన్ని కోట్ల రూపాయల నిధులైన తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు వైరా పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది మునిసిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనేదే తన లక్ష్యమని ఆయన అన్నారు.. వైరా మున్సిపాలిటీలో మండల కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి పనులు వేగంగా జరుగుతున్నాయని అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని యూనివర్సిటీ కంటే గొప్పగా పాఠశాల నిర్మాణం త్వరలో ప్రారంభం కాబోతుందని ఆయన అన్నారు అలాగే వైరా రిజర్వాయర్ కు గతంలో నాగార్జునసాగర్ నుండి నీరు వచ్చిన ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఉండేవని త్రాగునీటికే అనేక ఇబ్బందులు పడ్డారని అటువంటి సమస్యలు ఉండకుండా ఉండేందుకే ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా పాలనలో 100 కోట్లు ఖర్చు చేసి గోదావరి నుండి గోదావరి జలాలను వైరా రిజర్వాయర్కు తీసుకొచ్చామని ఆయన అన్నారు. దీనివల్ల నియోజకవర్గంలోని 4 మండలాలకు త్రాగునీటి సమస్య సాగునీటి సమస్య ఉండదని ఎండాకాలంలో కూడా 16 17 అడుగుల నీరు నిలువ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. వైరా పట్టణంలోని రెండో పెద్ద రోడ్డుగా వాసవి కళ్యాణ మండపం నుండి కమ్మవారి కళ్యాణ మండపం వరకు నిర్మాణం చేపడుతున్న ఈ రోడ్డును ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు నాణ్యతలో ఎక్కడ రాజీ పడకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారం పది రోజులలో పనులను ప్రారంభించాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశించారు. వైరా టౌన్ లో నిరుపేదలైన లబ్ధిదారులకు 500 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని అలాగే అర్హత ఉన్న ప్రతి నిరుపేద లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది అని ఆయన అన్నారు.త్వరలో రానున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రజలను విజ్ఞప్తి చేశారు నిరంతరం ప్రజాక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలు నిలబడాలని ప్రజలకు మేలు చేసే ప్రజా ప్రభుత్వాన్ని దీవించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ పిసిసి కార్యదర్శి కట్ల రంగారావు. మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు పట్టణ అధ్యక్షుడు ఏదునూరి సీతారాములు. రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శీలం వెంకట నర్సిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్. పొదిల హరినాథ్. రాoపూడి రోశయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు. పాలేటి నరసింహారావు. పమ్మి అశోక్ కొప్పురావూరి శబరి వీరం శెట్టి సీతరాములు పనితీ శ్రీను పనితీ సైదులు. కట్ట సంతోష్ ధర్నా రాజశేఖర్. మిట్టపల్లి నాగి. గొల్లపూడి కృష్ణారావు కొల్లి రమేష్.సయ్యద్ అన్వర్. మాజీ మార్కెట్ చైర్మన్ బీడీ కే రత్నం. మాజీ జెడ్పిటిసి నంబూరి కనకదుర్గ. రెండో వార్డ్ మాజీ కౌన్సిలర్ బత్తుల గీత పల్లపు కొండలు. చెరుకూరి కిరణ్. మాజీ కౌన్సిలర్ సూర్యదేవర శ్రీధర్. మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఐవి నాగేశ్వరరావు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేచర్ల మల్లేశ్వరి. ఆది ఆనందరావు. కంభంపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :