Wednesday, 13 May 2026 04:18:25 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఓదెల మల్లన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం 45 రోజుల్లో కొత్త హంగులు ప్రభుత్వ విప్

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 13 May 2026 02:34 PM Views : 156

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల /పెద్దపల్లి మే 13 (అక్షరం న్యూస్) కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయానికి మంచి రోజులు వచ్చాయని ఆలయ అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అని 45 రోజుల్లో కొత్త హల్లులతో ఆలయం సుందరీకరణoగా తీర్చి దిద్దామని ప్రభుత్వ చెప్ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు ఈ సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఓదెల మల్లన్న ఆలయానికి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావుకు ఆలయ అధికారులు మరియు పాలకమండలి సభ్యులు పూల బొకే అందించి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయానికి ఆహ్వానించి స్వామివారి కి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదంలో అందించారు అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలోనే అతిపెద్ద శైవ పుణ్యక్షేత్రమైన శ్రీ ఓదెల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయానికి మంచి రోజులు వచ్చాయని దశాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి వైపుకు తీసుకు వెళ్తున్నామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అన్ని విధాల సౌకర్యాలు సమకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అంతకుముందు 35 లక్షలతో డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా ఆలయానికి 4 దిక్కుల రోడ్ల నిర్మాణం చేస్తున్నామని అదేవిధంగా డిఎంఎఫ్టీ నిధులనుండి కోటి రూపాయలతో ఆలయం చుట్టూ సిసి నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసుకోవడం జరిగిందని 15 లక్షలతో సామూహిక మరుగుదొడ్లు నిర్మించడం జరుగుతుందని 20 లక్షలతో ఆలయానికి చుట్టూ సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అనేక మౌలిక వసతులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అన్ని ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న రైతులు ఎటు 500 గజాల దూరంలో భూములు అమ్మిన కొన్న వాటిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రైతులు తప్పకుండా సహకరించాలని దీనిపై ఎవరు ఎలాంటి క్రయవిక్రయాలు చేసిన వారిపై చర్యలు ఉంటాయని అన్నారు ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు మరియు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పిట్టల రవికుమార్ ముదిరాజ్ ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య నాయకులు సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి రెడ్డి రజనీకాంత్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు. మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ ఆలయ కమిటీ డైరెక్టర్లు జంగ కొమురయ్య కోదాటి మనోహర్రావు. జిలక రమేష్. కట్కూరి సమ్మిరెడ్డి. కొండ శ్రీనివాస్. తాళ్లపల్లి శ్రీనివాస్. ఇరవేణి రవికుమార్ ముదిరాజ్. ఉప్పుల శ్రావణ్ కుమార్. గంట రమేష్. శ్యామల యామని. ఆలయ ఈవో ఈ సదయ్య నాయకులు. సర్పంచులు గంగిశెట్టి ప్రభాకర్.. గుగులోతు నిమ్మ. నంగిల్ల నరసింహారెడ్డి. చిట్ల రామ్ ముదిరాజ్ కంకణాల భాస్కర్ రెడ్డి సొప్పరి సంధ్య కుమార్ ముదిరాజ్. ముప్పాల శంకర్ నాయకులు. చింతం కుమారస్వామి. నాగపురి రవి. పచ్చిమట్ల శ్రీనివాస్. బైడి రవి గౌడ్. తీర్థాల వీరన్న తోపాటు వివిధ గ్రామాల ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :