D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 5(అక్షరం న్యూస్) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కేంద్రములోని కోమట్లగూడెం ఉన్న అగ్రోగ్ రైతు సేవా కేంద్రములో గత కొన్ని సంవత్సరాలుగా అగ్రోస్ నిర్వహిస్తున్నారు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యూరియా మీద సబ్సిడీ ధర కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసి అత్యంత తెలివిగా బిల్లు ఇవ్వకుండా వెళ్ళిపొమ్మన్ని చెపుతున్నారు. ఇక్కడ మీడియా, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పలుమార్లు సమాచారం అందించిన ప్రయోజనం లేదని, జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలి అని గ్రామస్తులు, రైతుల చెబుతున్నారు ఒక్క యూరియా 266 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ధర. కానీ ఇక్కడ 330 రూపాయలు తీసుకొని బిల్లు చిట్టి కూడా ఇవ్వటం లేదని, గత కొంత కాలంగా సబ్సిడీ కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్న ఎవరు పట్టించుకోకపోవటం కొంచెం విడ్డూరంగా ఉంది దీని పై మండల కేంద్రములో వ్యవసాయ శాఖ అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు యువకులు కోరారు
.
Aksharam Telugu Daily