GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జూన్-14(అక్షరం న్యూస్) విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జరిగింది.తల్లి దూరమైన బిడ్డలకు ఎలాంటి లోటు రా నివకుండా తండ్రి అన్ని తానయ్యాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో పిల్లలు అనాధాలయ్యారు స్థానిక . ఎస్ ఐ గణేష్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని తెర్లు మద్ది గ్రామానికి చెందిన బైతి రాజయ్య తన ఇంటిలో నీటి తో కడుగుతుండగా ఇంట్లో కి వచ్చే సర్వీస్ వైరు వరండాలో పడడంతో ప్రక్కకు జరుపుతున్న క్రమంలో ప్రమాద వసత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడే పడిపోయాడని తెలిపారు. వెంటనే స్థానిక ఆసుపత్రి కి తరలిస్తుండగా. మార్గమధ్యంలో మృతి చెందాడని తెలిపారు మృతుల కూతురు బైతి శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. మృతుని భార్య మంజుల పది సంవత్సరాల క్రితం మృతి చెందింది.కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాజయ్య ఆకస్మాత్తుగా మరణించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.మృతునికి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు సంతానం కలరని తెలిపారు
.
Aksharam Telugu Daily