Thursday, 06 August 2026 02:48:07 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

శివాలయం లౌడ్‌స్పీకర్ల తొలగింపుకు యత్నిస్తే ఆందోళనలు ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించే చర్యలు సహించబోమని హెచ్చరిక

కౌన్సిలర్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి పెద్దపల్లి బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణరెడ్డి


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 05 August 2026 08:17 PM Views : 75

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 05 అక్షరం న్యూస్ పెద్దపల్లి పట్టణంలోని పురాతన దేవాలయం శివాలయంలో లౌడ్‌స్పీకర్ల తొలగింపునకు సంబంధించి స్థానిక కౌన్సిలర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వస్తున్న సమాచారం నేపథ్యంలో పెద్దపల్లి బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి బుధవారం స్పందించారు. ఈ మేరకు పెద్దపల్లిలో వారి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలొని శివాలయం ఆలయంలోని లౌడ్‌స్పీకర్ల తొలగింపునకు అధికారులు ప్రయత్నిస్తే బీజేపీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. శివాలయంలో సుప్రభాతం, భక్తి గీతాలు, శివనామస్మరణ వంటి కార్యక్రమాలు తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయమని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసినట్లు పేర్కొంటున్న కౌన్సిలర్ వెంటనే తన ఫిర్యాదును ఉపసంహరించుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని, ఆలయ సంప్రదాయాలకు భంగం కలిగించే చర్యలను బీజేపీ సహించదని స్పష్టం చేశారు. ఇతర మత ప్రార్థనా మందిరాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా శివాలయంలో మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పల్లె సదానందం, శిలివేరు ఓదెలు, భూషణవేణి శ్రీనివాస్ గౌడ్, జంగా చక్రధర్ రెడ్డి, పర్శ సమ్మయ్య, మీస అర్జున్‌రావు, రాంసింగ్, శిలారపు పర్వతాలు, శనిగరపు రమేష్, గర్రెపల్లి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :