Wednesday, 04 March 2026 01:41:32 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వనవాసీ సేవలు అమోఘం ఆదివాసీ విద్యార్థుల క్రమశిక్షణ ఎంతో ఆకట్టుకుంది ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ శ్రీదర్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 02 August 2025 08:53 PM Views : 570

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 2/ అక్షరం న్యూస్:---పేద ఆదివాసీ విద్యార్దులకు వనవాసీ కళ్యాణ పరిషత్ అందచేస్తున్న సేవలు అమోఘమని కొయ్యూరు ప్రాదమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ శ్రీదర్ అన్నారు. శనివారం చర్ల లోని వనవాసీ కొమరం భీం విద్యార్ది నిలయం కు పలువురు దాతలు వితరణ లను అందచేసారు. వనవాసీ కమిటి సభ్యుడు, శ్రీ సీతారామ ఆయిల్ బంక్ మేనేజర్ శివరాజు కిషోర్ - సంతోషి దంపతుల కుమారుడు కార్తికేయ జన్మదినం సందర్భంగా 25 కేజీల బియ్యం, పండ్లు, స్వీట్స్ అందచేసారు. ప్రభుత్వం ఉపాద్యాయుడు శివరాజు రవికుమార్ తన తండ్రి శివరాజు ఆంజనేయులు జ్ఞాపకార్థం విద్యార్థుల వినోదం కొరకు ఏడాది పాటు టివి వీక్షించేందుకు ఎయిర్ టెల్ నెట్‌వర్క్ రీచార్జ్ చేసారు. ఎలక్ట్రీషియన్ పెదిరెడ్డి రమేష్ జ్ఞాపకార్థం కుమారుడు పెదిరెడ్డి విక్రం కుమార్ - హారిక దంపతులు 50 కేజీల బియ్యం, పండ్ల ను వితరణగా అందజేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన డాక్టర్ శ్రీదర్ మాట్లాడుతూ ఇక్కడి విద్యార్థుల క్రమశిక్షణ తనను ఎంతో ఆకట్టుకుందని అన్నారు. విద్యార్థులు శ్లోకాలను ఆలపించిన తీరు అమోఘమని ప్రశంసించారు. దాతలు ఇటువంటి పేద విద్యార్దుల అభ్యున్నతి వితరణ లను అందచేయడం అబినందనీయమని అన్నారు. విద్యార్దులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగ పరుచుకొని ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వనవాసీ నిలయ కమిటీ అద్యక్షుడు తాటి పాపారావు ఉపాద్యక్షులు జవ్వాది మురళీకృష్ణ, కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, శివరాజు కిషోర్ సంతోషి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, హెల్త్ సూపర్ వైజర్ రాంప్రసాద్, ఆశా కార్యకర్త ఉషారాణి, పెదిరెడ్డి హారిక పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :