GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/ఏప్రిల్ 2/అక్షరం న్యూస్ :- జిల్లా మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శంకరపట్నం మండల పరిధిలోని తొమ్మిది అంగన్వాడి కేంద్రాలకు (ఆర్వో )వాటర్ ప్యూరిఫైయర్ ను ఐసిడిఎస్ సూపర్వైజర్స్ అందజేశారు.గురువారం రోజున చింతలపల్లి గ్రామ సర్పంచ్ చింతల లావణ్య,ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ అంగన్వాడి కేంద్రంలో వాటర్ ప్యూరిఫైయర్ ను ఏర్పాటు చేశారు.సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ అంగన్‌వాడీలలో పిల్లలకు శుద్ధి చేసిన నీటిని అందించడానికి వాటర్ ప్యూరిఫైయర్ ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ రణధీర్ రెడ్డి,చింతల శ్రీనివాస్,ఏడబ్ల్యూటి సరిత, అధికారులు,ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily