AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : . భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం/ అక్టోబర్ 25/ అక్షరం న్యూస్ - : కర్నూల్ జిల్లాలో శుక్రవారం తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని, దాదాపు 20 మంది దహనమై మృతి చెందటం తనను కలచి వేసిందని రాష్ట్ర మైనార్టీ నాయకులు డాక్టర్ నయీం ఖురేషి ఆవేదన వ్యక్తం చేశారు. స్లీపర్ బస్సులు విపరీతమైన వేగం తో వెళ్తున్నాయని, తగిన ఫిట్నెస్ కూడా ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఈ బస్సుల వేగాన్ని నియంత్రించి, తగిన ఫిట్ నెస్ లేని వాటిని రోడ్డుపై తిరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిద్ర లోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వ్యక్తుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వారి జీవితాలను తెచ్చివ్వలేకున్నా, వారిపై ఆధారపడ్డవారికి పెద్ద ఎత్తున తగిన పరిహారం ఇవ్వాలని, పెద్ద ఎత్తున కావేరి ట్రావెల్స్ నుండి ఆ సొమ్ము రికవరి చేయాలనీ నయీమ్ ఖురేషి డిమాండ్ చేశారు.
Aksharam Telugu Daily