D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 14 (అక్షరంన్యూస్) జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్ఆర్&బిజీఎన్ఆర్ కళాశాలలో ఇట్టి పరీక్షలు చేపట్టినట్లు అన్నారు. ఉదయం సెషన్ లో చేపట్టిన థియరీ పరీక్షకు 129 మంది అభ్యర్థులకు గాను 128 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఒకరు గైర్హాజరు అయినట్లు, మధ్యాహ్నం నిర్వహించిన ప్లాటింగ్ పరీక్షకు 205 మంది అభ్యర్థులకు గాను 202 మంది హాజరుకాగా, ముగ్గురు గైర్హాజరు అయినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల నిర్వహణ పర్యవేక్షణ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి శ్రీనివాసులు, సిపిఓ ఏ. శ్రీనివాస్ లు చేపట్టారని కలెక్టర్ అన్నారు.
.
Aksharam Telugu Daily