D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 8 (అక్షరంన్యూస్) హైదరాబాద్, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఎదురులేని శక్తిగా కాంగ్రెస్ మారుతోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో జరుగుతున్న నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా సోమవారం నాడు గాంధీ భవన్ లో ఉప ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్ఎస్ కు చెందిన 70 కుటుంబాలు కాంగ్రెస్ లో చేరాయి. వీరందరికీ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో జరగుతున్న అభివృద్ధి, సామాన్యులకు సైతం అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వారు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థలు, రైతులకు రుణమాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరావు, ఆత్మా కమిటీ ఛైర్మన్ కర్నాటి రామ కోటేశ్వర రావు, బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు, పైడిపల్లి కిషోర్, నూతి సత్యనారాయణ, వడ్డే నారాయణ రావు, వేమిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily