D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/జులై 2(అక్షరం న్యూస్) ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పత్రిక ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులుజులై 1న మంత్రి సీతక్క పై కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు ఫైడాకుల అశోక్ పటేల్ పై నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు వార్త ను ప్రచురితం చేసిన నమస్తే తెలంగాణ వార్తను ఖండించిన కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య.. వారు మాట్లాడుతూ... నిరంతరం ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్న మంత్రి సీతక్క ను ప్రజల నుండి ఎవరు దూరం చేయలేరు ఆనాడు ఉద్యమం లో వున్న నిన్న ప్రతిపక్షంలో ఉన్న నేడు అధికారంలో ఉన్న ప్రజల కోసమే ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ వారు సీతక్క .. స్ఫూర్తితోనే జిల్లా మొత్తంలో ఎక్కడ సమస్య ఉన్నా గానీ ప్రజలకు ఎలాంటి అవసరం ఉన్నా గాని వెంటనే స్పందించి అట్టి సమస్యలకు పరిష్కారం చూపి రాష్ట్రమంత్రి సీతక్క కు అట్టి సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేసి ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ ప్రాంతాలు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయి దీనిని జీర్ణించుకోలేకపోతున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారి తొత్తు అయిన నమస్తే తెలంగాణ దినపత్రిక (కరపత్రము ) లో ఆకాశ రామన్న ఎవరో రాసిన దానిని ప్రచురితం చేసి సీతక్కను కాంగ్రెస్ పార్టీని పార్టీ నాయకులను అబద్ధపు వార్తలతో దెబ్బతీయాలని చూసిన ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు మునుముందుగా ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే ఇక సహించబోమని ప్రజలే తగు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం పత్రికల నైతిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మరియు మీకు జ్ఞానోదయం కలగాలని సమాజంలో పేరు ప్రతిష్టలు రావాలంటే వాస్తవాన్ని మాత్రమే ప్రజలకు వివరించాలని వజ్జ సారయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి, లావణ్య వెంకన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బిట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి, బొల్లు రమేష్ నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ఇర్ప రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి . గుమ్మడి సమ్మయ్య కొత్తగూడ టౌన్ అధ్యక్షులు మల్లెల రణధీర్ స్థానిక కొత్తగూడ మాజీ సర్పంచ్. బోయినేని ప్రశాంత్ రెడ్డి కొత్తగూడ యూత్ అధ్యక్షులు ముడిక సంతోష్ యాదవ్ బొల్లం ఐలయ్య కోనాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు. బూర్కా పుష్పలత నరేందర్ మాజీ ఎంపిటిసి కొత్తగూడ తోలేo అనంతరావు రాజం సాంబయ్య టౌన్ గ్రామ కమిటీ కోశాధికారి బోడ ఈరియా ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సోలెం వెంకన్న మండలం నాయకులు సిరిగిరి సురేష్ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ దేవర శ్యాంసుందర్ గొందిరాజు మండల నాయకులు. తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily