P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల /పెద్దపల్లి జూన్ 17 (అక్షరం న్యూస్) పెద్దపల్లి జిల్లాలోనిఅతిపెద్ద శైవ పుణ్యక్షేత్రమైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈనెల 23న కమిషన్ ముందు హాజరుకావాలని ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం ఈవోకు నోటీసులు జారీ చేశారు స్థానిక వివరాలకు వెళ్తే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవోకు సమాచార కమీషనర్ తెలంగాణ నుండి నోటీసులు అందాయి. ఓదెల మం డల కేంద్రానికి చెందిన నాగపురి రవి 23/12/2020-21/10/2021 తేదీలలో ఓదెల గ్రామంలో ఉన్న చీకటి ఆంజనేయస్వామి దేవాలయం మరియు, ఓదెల మల్లి కార్జున స్వామి దేవాలయం మరియు రామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించిన భూముల వివరాలు దాని విస్తీర్ణం భూమికి సంబంధించినటువంటి పాసుబుక్కులు మరియు దేవాలయంలో పనిచేస్తున్నటువంటి శాశ్వత ఉద్యోగుల వివరాలు ఉద్యోగుల జీతభత్యాలు లాంటి అంశాలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడగగా ఆలయ అధికారి నుండి సరైన సమాచారం లేకపోవడంతో అక్కడినుండి అసిస్టెంట్ కమిషనర్ కరీంనగర్ మరియు డిప్యూటీ కమిషనర్ వరంగల్ను సమాచారం కోరగా అక్కడ కూడా అదే పరిస్థితి కనిపించినట్లు పిటిషన్ దారి నాగపురి రవి తెలిపారు దీంతో సమాచార కమిషనర్ తెలంగాణకు వివరాలు అందిం చగా ఈనెల 23న కమిషనర్ ముందు హాజరుకావాలని దేవస్థానం ఈవోకు నోటీసులు జారీ చేశారు.
.
Aksharam Telugu Daily