P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ఓదెల./ పెద్దపల్లి జులై 11 (అక్షరం న్యూస్) కొన్ని ఏళ్లుగా ఓదెల గ్రామంలో ఎస్ బి ఐ బ్యాంకు సేవల కోసం అనేక వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంగా ఎస్బిఐ అధికారులు స్పందించి ఎట్టకేలకు ఓదెల గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ని ఏర్పాటు చేశారు ఈ బ్యాంకు శనివారం ఘనంగా పూజలు నిర్వహించి బ్యాంకు ను ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజర్ భాస్కర్ గొల్ల మాట్లాడుతూ ఈరోజు పూజ నిర్వహించడం జరిగిందని సోమవారం నుండి బ్యాంకు సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ప్రజలంతా బ్యాంకును వినియోగించుకోవాలని అన్నారు మండలంలోని 22 గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకొని కొత్త ఖాతాలు ప్రారంభం తో పాటు వివిధ రకాల రుణాలు ఇతర బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ కనికి రెడ్డి సతీష్ మాట్లాడుతూ ఓదెల గ్రామ ప్రజల చిరకాల కోరిక అయిన బ్యాంకు వదలకు రావడం ఎంతో సంతోషకరమైన విషయం అని బ్యాంకు రావడం కోసం అనేకమంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారని వారి కోరిక ఫలించి బ్యాంకు ను ప్రారంభించుకోవడం జరిగిందని ప్రజలంతా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ భాస్కర్ గొల్ల తో పాటు క్యాషియర్ క్రాంతి సపోర్ట్ స్టాప్ రమణ సర్పంచ్ సతీష్ మరియు వార్డు సభ్యులు దూలం సదానందం తో పాటు. వ్యాపారవేత్త సంతోష్. తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily