AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 23/అక్షరం న్యూస్/--- సిపిఐ సీనియర్ నాయకుల మాజీ జాతీయ కార్యదర్శి మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవికుమార్ అన్నారు. సురవరం మృతికి సంతాపంగా స్థానిక భద్రాచలం డివిజన్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలినాళ్ల నుండి చివరి వరకు కమ్యూనిస్టు పార్టీతోనే ఉంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పని చేశారని చెప్పారు. ఆయనకున్న ఆస్తులను ప్రజలకు ధారా దత్తం చేసి ప్రజాసేవలో నిమగ్నమైన నిబద్దత గల నేత అని తెలిపారు. సిపిఐ మూడు పర్యాయాలు జాతీయ కార్యదర్శిగా పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు పని చేసిన ఆయన ఆ పదవులకు వన్నెతెచ్చారని అన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచి పోతుందన్నారు. సురవరం ఆశయాల సాధన కోసం పయనిస్తూ ఆయన చూపిన మార్గాన ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారెడ్డి శివాజీ ఏపూరి వెంకటేశ్వరరావు, ఎస్వీఎస్ నాయుడు మీసాల భాస్కరరావు కొండబాబు మహేష్. పందా సత్యానంద్ సాధనపల్లి సతీష్, కంభంమెట్టు శ్రీను రామారావు ఉమా కుమారి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily