DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్,పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 29 అక్షరం న్యూస్:సద్దుల బతుకమ్మ వేడుకలను సోమవారం గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు తంగేడు గునుగు పువ్వుతో పాటు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను తయారు చేశారు సాయంత్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో మహిళలు పేర్చిన బతుకమ్మలను పెట్టి వలయాకారంగా తిరుగుతూ బతుకమ్మ ఆడారు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆడడం ఆకర్షణీయంగా నిలిచింది బతుకమ్మ ఆడిన అనంతరం సమీపంలోని మల్లయ్య కుంట చెరువులో నిమర్జనం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు , చిన్నారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily