Friday, 20 November 2026 01:47:55 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రామగిరి ఖిల్లాలో సినీ హీరో నాగచైతన్య సందర్శన.. -సినిమా షూటింగ్ కోసమేనా?

చారిత్రక రామగిరి ఖిల్లాపై సినీ చిత్రబృందం ఆసక్తి.. స్థానికంగా జోరుగా ప్రచారం


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 November 2026 03:48 PM Views : 57

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : - రామగిరి (పెద్దపల్లి జిల్లా) నవంబర్ 17 అక్షరం న్యూస్: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లోని చారిత్రక రామగిరి ఖిల్లాను మంగళవారం ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగచైతన్య సందర్శించారు. ఓ సినిమా చిత్రీకరణకు అనువైన ప్రదేశాల పరిశీలనలో భాగంగానే ఆయన రామగిరి ఖిల్లాను సందర్శించినట్లు సమాచారం.చారిత్రక నేపథ్యం, ప్రకృతి అందాలు, ఎత్తైన కొండలు, పురాతన కట్టడాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన రామగిరి ఖిల్లా పర్యాటకులతో పాటు సినీ రంగానికి కూడా ఆకర్షణీయమైన ప్రదేశంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ హీరో నాగచైతన్య రాక వార్త స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.రామగిరి ఖిల్లాలో సినిమా చిత్రీకరణ జరిగితే ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు లభించడంతో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా దోహదపడే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే నాగచైతన్య పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, సినిమా షూటింగ్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :