Friday, 17 July 2026 02:38:50 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కిన మున్సిపల్ ఏఈ పక్కా ప్రణాళికతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 14 July 2026 02:10 PM Views : 442

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూలై 14 అక్షరం న్యూస్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అవినీతికి పాల్పడిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ సతీష్, ఏసీబీ అధికారులకు చిక్కాడు. కాంట్రాక్టర్ కు సంబంధించిన బిల్లు ప్రాసెస్ చేయడానికి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి అదే మొత్తాన్ని స్వీకరిస్తున్న సమయంలో కరీంనగర్ రేంజ్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని మున్సిపల్ పరిధిలో పనులు చేపట్టిన ఓ కాంట్రాక్టర్ పనికి సంబంధించిన బిల్లు విడుదల చేయాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని ఏఈ సతీష్ సంబంధిత కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం పలుమార్లు ఒత్తిడి చేసినప్పటికీ లంచం ఇవ్వడానికి నిరాకరించిన కాంట్రాక్టర్ చివరకు కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులును ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పక్కా ప్రణాళికతో ఉచ్చుపన్నారు మంగళవారం పెద్దపల్లి పట్టణంలోనీ ఏఈ సతీష్ నివాసానికి కాంట్రాక్టర్ ను పంపించి ముందుగా రసాయన పూత పూసిన కరెన్సీ నోట్లను అందజేశారు. ఏఈ సతీష్ రూ2 లక్షలు స్వీకరించిన సమయంలో ఏసీబీ అధికారులు ఒక్క సారిగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం నిందితుడికి ఫైనాఫాలిన్ పరీక్ష నిర్వహించగా. ఆయన చేతులకు రసాయన పరీక్ష పాసిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు, లంచంగా తీసుకున్న నగదు తో పాటు కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన ఫైళ్ళు బిల్లులు సంబంధింత పత్రాలను కూడా అధికారులు పరిశీలించారు కేసుకు సంభందించిన కీలక ఆధారాలను సేకరించి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏసీబీ ట్రాప్ ఆపరేషన్ కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది నిందితుడిపై అవినీతి నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వైద్య పరీక్షల అనంతరం కరీంనగర్లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని అధికారులు తెలిపారు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావు లేకుండా కఠిన చర్యలు కొనసాగుతాయని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా విధులు నిర్వహణలో లంచాలు డిమాండ్ చేసిన లేదా స్వీకరించిన ప్రజల వెంటనే ఏసీబీ ని ఆశ్రయించాలని అధికారులు సూచించారు ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :