AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ సెప్టెంబర్ 06 అక్షరం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గా నియామకమైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావుకి ప్రభుత్వం తరుపున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో అధికారిక కార్యాలయం కేటాయించడం జరిగింది. ఆ కార్యాలయం ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు వేద పండితులు మధ్య ఆదివారం రోజున మంత్రోత్సవాలతో ప్రారంభం చేయడం జరిగింది. ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఎమ్మెల్సీ తానిపత్రి భాను ప్రసాద్ రావు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వారందరూ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావుకి శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు
.
Aksharam Telugu Daily