GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట /హుస్నాబాద్ : హుస్నాబాద్ /సిద్దిపేట మార్చి 10(అక్షరం న్యూస్ ) హుస్నాబాద్ పట్టణంలోని పాత మున్సిపల్ ఆఫీస్ ముందు గల మునిసిపల్ కాంప్లెక్స్ దుకాణదారులకు షాప్ రెంటర్స్ కు షాప్స్ ఖాళీ చేయాలని కోరుతూ, కొత్త టెండర్ వేస్తామని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయగా సోమవారం హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునకి కొత్త టెండర్ ప్రక్రియను విరమించుకోవాలని షాప్ రెంటర్స్ కు మద్దతు తెలుపుతూ వారితో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా బత్తుల శంకర్ బాబు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మునిసిపల్ కాంప్లెక్స్ లో దుకాణాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారని, అందరూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారని, కొత్త టెండర్ వేయడం వల్ల వారంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణాల యాజమానులు విధిగా అద్దెలు చెల్లిస్తున్నారని, వారి కడుపు కోట్టోదని బత్తుల శంకర్ బాబు మున్సిపల్ కమిషనర్ ని కోరారు. కొత్త టెండర్ ప్రక్రియను విరమించుకోని, అద్దె రుసుం పెంచితే వారు విధిగా అద్దెలు చెల్లిస్తారని విజ్ఞప్తి చేశారు. కొత్తగా రిజిస్ట్రేషన్ ఆఫిస్ రావడంతో ఇప్పుడు, ఇప్పుడే వ్యాపారం ప్రారంభమైందని, ఇలాంటి సందర్భంలో కొత్త టెండర్ వేయడం వల్ల వారంతా నష్టపోయి, వారి కుటుంబాలు రోడ్డున పడుతాయని తెలిపారు. వెంటనే కొత్త టెండర్ ప్రక్రియను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వరియోగుల అనంతస్వామి, వెల్దండి సంతోష్ గాదాసు రాంప్రసాద్ , షాప్ రెంటర్స్ మ్యాన మల్లేశం, పెట్టుగడి సంపత్, మాడి శెట్టి రమాదేవి, కృష్ణా చారీ , రాచకొండ సిద్ధిరాములు, మాంచాల పాపయ్య, పోగుల యాదగిరి, వెంకటరమణ, సాయిరాం, పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily