AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే18 అక్షరం న్యూస్ శ్రీమాతా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కాసర్ల రాజు జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్‌లో సంస్థ డైరెక్టర్ల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ కాసర్ల రాజు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో, ప్రమాదాల సమయంలో మరియు క్యాన్సర్, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాధితులను కాపాడటంలో మనం చేసే రక్తదానం ఎంతో కీలకమని, ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానంతో సమానమని అన్నారు.18 నుండి 65 సంవత్సరాల వయస్సు గల ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తకణాల ఉత్పత్తి మెరుగుపడటమే కాకుండా గుండె జబ్బుల ముప్పు తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని, రక్తదానంపై ఉన్న అపోహలను వీడి ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం శ్రీమాతా డెవలపర్స్ కుటుంబ సభ్యుల సమక్షంలో కాసర్ల రాజు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకోగా, రక్తదానం చేసిన దాతలకు ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందజేసి అభినందించారు. కాగా ఈ మెగా శిబిరంలో సేకరించిన 202 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ రంగ బ్లడ్ బ్యాంక్‌లకు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ గుజ్జుల కుమార్, నాయకులు పుల్లయ్య, శ్రీనివాస్ గౌడ్, జగన్, జెట్టి శ్రీనివాస్, కంపెనీ సీఎంఓ, డైరెక్టర్లు కోట మల్లేష్, బొడ్డు సుమన్, బొడ్డుపల్లి రవి, డాక్టర్ శ్రీనివాస్, పరశురామ్ గౌడ్, బండ రాజన్న, కొమిరిశెట్టి శ్రీనివాస్, గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్, సంతోష్, రమేష్, శ్రీధర్, సంపత్, విజయ్, శ్రీను, మేఘన, శ్రీజ, అనయ ఫౌండేషన్ ప్రతినిధి ఆకుల నవీన్, టిఎక్స్ హాస్పిటల్ ప్రతినిధులు, పెద్దపల్లి, గోదావరిఖని బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు వెంకటేష్, వేణుగోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily