AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 5/అక్షరం న్యూస్/---- డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నీ పురస్కరించుకొని గురుదేవ్ విద్యాలయం నందు గురు పూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ముందుగా ప్రధానోపాధ్యాయులు హెచ్జీ వి ప్రసాద్ అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎం వి సుబ్రహ్మణ్యం జి.శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పదవ తరగతి విద్యార్థినులు గురు బ్రహ్మ గురు విష్ణుః అంటూ తమ నృత్యం తో అలరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గిరి అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎం.వి సుబ్రమణ్యం జి.శ్రీనివాస్ లు విశ్రాంత ఉపాధ్యాయులు గురువులు జవ్వాది నరేంద్ర బాబు ను ఘనంగా సన్మానించారు. పదవ తరగతి విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ప్రతి రోజూ తమ సహకారాన్ని అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటం లో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఆయాలను స్కా వెంజర్స్ ను మరియు బస్సు డ్రైవర్లు ను ఘనంగా సత్కరించారు.అనంతరం ఉపాధ్యాయ బృందాన్ని సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు తమ ఆట పాటలతో అలరించారు.
.
Aksharam Telugu Daily