Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/చొప్పదండి : * చొప్పదండి/ కరీంనగర్, మార్చి 10 (అక్షరం న్యూస్) ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నడిచే జనరిక్ మెడికల్ షాపు ను సోమవారం రోజున చొప్పదండి సొసైటీ అధ్యక్షులు వెలమ మల్లారెడ్డి ప్రారంభించారు.చొప్పదండి పరిసర ప్రజలకు అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన ఔషధాలు అందించడానికి లాభాపేక్ష లేకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కట్టుబడి ఉందని, కేవలం చొప్పదండి మండలం వారే కాక చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ చొప్పదండి వ్యవసాయ మార్కెట్ రోడ్డులో ఉన్న సహకార సంఘం మెడికల్ షాపును వినియోగించుకొని , తక్కువ ధరకు మెడిసిన్స్ పొందవచ్చని వెల్మ మల్లారెడ్డి అన్నారు.దేశంలోనే నెంబర్ వన్ వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం గా ఉన్న చొప్పదండి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిగా తమ పాలకవర్గం ఆధ్వర్యంలో చవక ధరల నాణ్యమైన మందుల దుకాణం ప్రారంభించడం ఆనందకరంగా ఉందని, ఇందుకు అనుమతులు రావడానికి అన్ని విధాలుగా సహకరించి సమన్వయం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కి చొప్పదండి మండల మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కేంద్ర మోడీ ప్రభుత్వ జనరీక్ మెడికల్ షాపును మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు వెల్మ మల్లారెడ్డి, ముఖ్య కార్య నిర్వహణ అధికారి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ ముద్ధం మహేష్ గౌడ్ , సింగిల్ విండో డైరెక్టర్ లందరికీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మాజీ ప్రజా ప్రతినిధులు, బిజెపి నాయకులు, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు గుర్రం భూంరెడ్డి, గుంటి మల్లయ్య, క్యాతం పురుషోత్తం. మాజీ జడ్పీటిసి ఇప్పనపల్లి సాంబయ్య, మాజీ ఎంపీటీసీ లు బత్తుల లక్ష్మీనారాయణ, తోట కోటేశ్,మాజీ సర్పంచ్ లు వెల్మ నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి,రమణారెడ్డి, అర్నకొండ సింగిల్ విండో చైర్మన్ మినుపాల తిరుపతి రావు, డైరెక్టర్లు గుర్రం ఆనంద రెడ్డి, కోస్న తిరుపతి రెడ్డి, కళ్లెం లక్ష్మారెడ్డి,నాంపల్లి మల్లయ్య, దుర్గం పద్మ,మంగళారపు మల్లారెడ్డి, సత్తూ నర్సయ్య, లంబు రాజిరెడ్డి, రెవెల్లి బాలయ్య,మాజీ కౌన్సిలర్ లు, దండే కృష్ణ, మాడూరి శ్రీనివాస్ నలు మాచు రామకృష్ణ, రైతులు గుర్రం నంది రెడ్డి రాజశేఖర్ రెడ్డి ,రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, రాములు మల్లయ్య ,శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జనరిక్ మెడికల్ షాపు ప్రారంభానికి తోడ్పడ్డ మండల మాజీ ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి ని చొప్పదండి సొసైటీ చైర్మన్, పాలక వర్గం వారు సత్కరించారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటులో తోడ్పాటు అందించిన బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు , చొప్పదండి మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి ని సొసైటీ ఛైర్మెన్ వెల్మ మల్లారెడ్డి , పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించి, శాలువా తో సత్కరించి కృతజ్ఞతలు తెలియ చేశారు.
.
Aksharam Telugu Daily