AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మే 17 అక్షరం న్యూస్ తమ న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అఖిలభారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల పిలుపుమేరకు ఆదివారం రోజున గోదావరిఖని లో బందు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగిందని, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మాడూరి వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ ల పరిష్కారానికై ఈనెల 20న దేశవ్యాప్త మెడికల్ షాపుల బందును నిర్వహిస్తున్నామని, దీనికి పెద్ద పల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ షాపులు బంధు నిర్వహించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్ మందుల అమ్మకాలు, నియంత్రణ లేకుండా ఆన్‌లైన్‌లో మందులు అమ్ముతున్నారనీ, డాక్టర్ చీటీ లేకుండా కూడా మందులు ఇస్తున్నారని, భారీ డిస్కౌంట్ల పేరిట కార్పొరేట్ కంపెనీలు, ఆన్‌లైన్ యాప్‌లు 30-70% డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల చిన్న మెడికల్ షాపులు నష్టపోతున్నాయనీ, కల్తీ ఔషధాలు నకిలీ, నాసిరకం మందులను నియంత్రించాలని, డాక్టర్ చీటీ దుర్వినియోగం చేస్తూ ఆన్‌లైన్‌లో ఒకే చీటీని పదేపదే వాడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని లేనియెడల ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలు మెడికల్ షాప్ లో యజమానులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily