D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 29 (అక్షరం న్యూస్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన షో రూమ్ లోనే నూతన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి ధర్మపురి జగదీష్ ప్రారంభించారు...ఖమ్మం కటకం హోండా షో రూమ్ నందు గురువారం ప్రధమంగా నూతన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కటకం యజమాని చిన్న హనుమంతరావు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా శాఖ అధికారి ధర్మపురి జగదీష్ హాజరై నూతనంగా రిజిస్ట్రేషన్ షో రూమ్ నందు డిటిఓ జగదీష్ ప్రారంభించారు. ఖమ్మంలోని కటకం హోండా షో రూమ్ నందు ఈరోజు ప్రధమంగా చేసినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ యజమాని కటకం చిన్న హనుమంతరావు, కటకం ఆకాష్ నూతనంగా కొనుగోలు చేసిన వాహనదారుడు కి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను వాహనదారుడుకు డిటిఓ జగదీష్ అందజేశారు. ఈ సందర్భంగా డిటిఓ మాట్లాడుతూ..వాహనదారులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు ఎ .వరప్రసాద్, ఆర్. స్వర్ణలత, జి.దినేష్ ,సుమలత, ఏవో రవికుమార్ రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily