P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి నవంబర్ 12 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని పోత్కపల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మాణం చేసిన స్టేషన్ రోడ్ లో గల ముదిరాజుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ గుడి ఆలయం లో పోతరాజు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోతురాజు విగ్రహం విధ్వంసానికి పాల్పడిన వ్యక్తి ఉత్తరకాండ రాష్ట్రంలోని హరిద్వార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు స్థానికులు పేర్కొన్నారు వ్యక్తి మద్యం మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేశాడని స్థానికులు ఇచ్చిన సమాచారంతో పొత్కపల్లి. ఎస్సై దికొండ రమేష్ విధ్వంసానికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకొని స్టేషన్ కు తరలించినట్టు ఎస్ఐ పేర్కొన్నారు ఈ సందర్భంగా ముదిరాజ్ కుల సభ్యులు స్పందిస్తూ పెద్దమ్మ గుడి ఆలయంలో ఉన్న పోతురాజు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎంతో పవిత్రమైన ఆలయంలో ఇలాంటి సంఘటన జరగడం అని బాధాకరమని వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకొని ఇంకెప్పుడు హిందూ దేవాలయాల జోలికి రాకుండా శిక్షపడేల చూడాలని డిమాండ్ చేశారు ఆ వ్యక్తి ఎందుకు ఇక్కడికి వచ్చాడు దేనికోసం వచ్చాడు వచ్చిన వ్యక్తి కేవలం విగ్రహాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు అనే దానిపై పూర్తిగా విచారణ చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో బాంబు పేలిన సంఘటన మర్చిపోకముందే మండలంలో ఇలాంటి విధ్వంసం చేయడం దేనికి సాంకేతమని ఇలాంటి వ్యక్తులను గుర్తించకపోతే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి దుండగుడిపై కఠిన చర్యలు చట్టరీత్యా శిక్ష పడే విధంగా చూడాలని కోరారు
.
Aksharam Telugu Daily