AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,/బూర్గుంపాడు మండలం/మొరంపల్లి బంజర. అక్షరం న్యూస్/జూన్ 16: బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామంలో 2025-26 సంవత్సరానికి గాను గురువారం మాత్రమే పశువుల సంత, శుక్రవారం కూరగాయల సంత నిర్వహించాల్సి ఉంది. అయితే సొంత నిర్వాహకులు వారి ఇష్టానుసారంగా నిబంధనలకు విరుద్ధంగా బుధవారం కూడా పశువుల సంతను నిర్వహిస్తూ గ్రామపంచాయతీ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మొరంపల్లి బంజర గ్రామపంచాయతీ సెక్రటరీ పలుమార్లు సంత నిర్వాహకులకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆ నోటీసులను సైతం ప్రక్కన పెట్టి మమ్మల్ని అధికారులు ఏమి చేయలేరనే ధోరణిలో వ్యవహరిస్తున్న తీరు బూర్గంపాడు మండల ప్రజలను కొంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరోవైపు అధికారుల సహాయ సహకారాలతోనే ఈ తంతు అంతా జరుగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా నిబంధనలకు విరుద్ధంగా సంతను నిర్వహిస్తున్న సంత యజమానులపై అధికారులు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు ముక్తకంఠ తో కోరుకుంటున్నారు.
.
Aksharam Telugu Daily