Wednesday, 04 March 2026 01:51:00 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రోడ్ల పై తిరుగుతున్న రెండు కేజీ వీల్స్ ట్రాక్టర్లును పట్టుకున్న ఎస్ ఐ దికొండ రమేష్

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 10 July 2025 04:50 PM Views : 3920

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జులై 10 (అక్షరం న్యూస్) కేజీ వీల్స్ ట్రాక్టర్లు రోడ్డుపై తిరుగుతే కఠిన చర్యలు కేజీ వీల్స్ ట్రాక్టర్లు రోడ్ల పై తిరగడం నిషేదం. ఎస్ ఐ అన్నారు ఈ సందర్భంగా గురువారం పోత్కపల్లి నుండి మడక మధ్యల ప్రధాన రహదారిపై తిరుగుతున్న కేజీ వీల్స్ ట్రాక్టర్లను గుర్తించి రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్ల పై తిరుగుతున్న రెండు కేజీ వీల్స్ ట్రాక్టర్లు పట్టుకోవడం జరిగింది అని , పట్టుకున్న కేజీ వీల్స్ ట్రాక్టర్లను స్థానిక ఓదెల తాసిల్దార్ కార్యాలయానికి జరిమానా కోసము పంపించినామని వర్షాకాలం సీజన్ ఆరంభమవుతున్న తరుణంలో ట్రాక్టర్ యజమానులు కేజీ వీల్స్ తో ట్రాక్టర్లను రోడ్లపైకి తేకూడదని, ముఖ్యంగా కోట్ల రూపాయలతో ప్రజల రవాణా సౌకర్యం కోసం నిర్మించబడ్డ తారు రోడ్లపై కేజీ వీల్స్ ట్రాక్టర్లు తిరగడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయని, తిరిగి వాటిని అభివృద్ధి పరచడానికి చాలా సమయం పడుతున్నందున ప్రజలు రవాణాకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ట్రాక్టర్ యజమానులు గ్రహించాలన్నారు. కేజీ వీల్స్ తో రోడ్లపై తిరిగే ట్రాక్టర్ల పై కఠినంగా వ్యవహరించాలని పై అధికారులు ఆదేశాలు ఇచ్చినందువల్ల రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంపై అధికార యంత్రాంగం దృష్టి సారించనున్నదని చెప్పారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్ యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేసి దండోరా కూడా వేయించనున్నామన్నారు. అయినా సరే ఎవరైనా ట్రాక్టర్ యజమానులు ఇట్టి ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే, మొదటిసారి 5000 రూపాయలు, రెండవసారి 10000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని, మూడవసారి దొరికిన కేజ్విల్ ట్రాక్టర్లకు 20 వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని, తెలిపారు. రోడ్లపైకి వచ్చిన కేజీ వీల్స్ ను వెంటనే జరిమానా విధిస్తూ, సంబంధిత చట్టం కింద కేసులు నమోదు చేపిస్తామని తెలియజేశారు.* ఈ విషయంలో ట్రాక్టర్ డ్రైవర్లు సహకరించాలని అన్నారు ట్రాక్టర్ డ్రైవర్లు కేజీ వీల్స్ కు పట్టీలు వేయించుకోవాలని తెలియజేశారు ఎవరైనా కేజీ వీల్స్ ట్రాక్టర్లు రోడ్ల పై రోడ్లపై తిరుగుతే సమాచారం ఉంటే వెంటనే పోత్కపల్లి ఎస్ఐ నెంబర్ 8712656514 కు సమాచారం అందించాలని తెలియజేశారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :