Friday, 03 April 2026 01:52:49 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది.. బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు.. ​ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 10 February 2026 04:02 PM Views : 294

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 10 (అక్షరం న్యూస్) ​ఖమ్మం : రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కొనసాగుతోందని, దీనిపై ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా ఉందని వెల్లడించారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ట్యాపింగ్ కోసం ఎక్కడెక్కడ ఎక్విప్‌మెంట్ (పరికరాలు) అమర్చారో ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీస్తోందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. *​ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం* "ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. ఇప్పుడు కూడా కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తోంది. ఎవరు సూత్రధారులు? ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారు? అనేది బయటకు తీస్తాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని మంత్రి స్పష్టం చేశారు. ఉద్యోగులను ఓట్లు అడగడంలో తప్పేముందని, తన పార్టీ తరపున తాను అడిగానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. *​మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతం పైగా సీట్లు కాంగ్రెస్ వే* నేడు (బుధవారం) జరగనున్న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. "గడిచిన రెండేళ్లలో మేం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజలకు చేరువయ్యాం. అందుకే ఈ పుర ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. ఇది జీర్ణించుకోలేకే ప్రతిపక్ష నాయకులు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విసిరిన సవాళ్లను ప్రజలు తిప్పికొట్టారు.. అదే ఫలితం రేపు పునరావృతం కాబోతుంది" అని అన్నారు. *అభివృద్ధికి పెద్ద పీట...* గత ప్రభుత్వ తీరుపై పొంగులేటి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. "కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ధనిక తెలంగాణను రూ. 8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. నెలకు రూ. 6,300 కోట్లు కేవలం అప్పులకే కడుతూ కూడా సంక్షేమాన్ని ఆపలేదు. గత దొరల పాలనలో పేదలను విస్మరించారు. 62 వేల డబుల్ బెడ్ రూంలను మొండిగోడలుగా మిగిల్చారు. కానీ మేం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 'వరి వేస్తే ఉరి' అన్న కాలం పోయి, ఇప్పుడు వడ్లకు బోనస్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం" అని వివరించారు. మాజీ మంత్రుల అసభ్య పదజాలానికి ప్రజలు ఓటు ద్వారానే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :