D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 14 వైరా (అక్షరంన్యూస్) రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం వైరా మండల పరిధిలోని రెబ్బవరం బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను భూక్యా వీరభద్రం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సొంత భవనం లేక అరకొర వసతులతో చదువులు సక్రమంగా చదవలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం సొంత భావనం నిర్మాణానికి నిధులు కేటాయించి నిర్మించాలని కోరారు. కాంట్రాక్టర్లు గురుకులాలకు నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని, ఎలాంటి అవకతవకలు లేకుండా విద్యార్థులకు మెనూ ప్రకారం అన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతివారం గురుకులాలకు సంబంధించిన అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని కోరారు. విద్యార్థులతో మాట్లాడి వారు చెప్పిన సమస్యలను అక్కడి ప్రిన్సిపాల్, వార్డెన్, సంబంధించిన వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. బాలికలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వారికి నిపుణులైన వైద్యులతో సకాలంలో వైద్య సౌకర్యాలు అందే విధంగా చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి మెనూ ప్రకారం అన్ని అందించాలని సూచించారు. పేద విద్యార్థులు సక్రమంగా విద్య అందే విధంగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. క్రమశిక్షణతో శ్రద్ధగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి రావాలని విద్యార్థినీలకు సూచించారు.
.
Aksharam Telugu Daily