D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ జులై 26 (అక్షరంన్యూస్) తల్లాడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎండి బహుదూర్, ప్రధాన కార్యదర్శిగా దేవబత్తిని సీతారాములు ఎన్నుకున్నారు. వీరితోపాటు గౌరవాధ్యక్షులుగా టీకే ప్రసన్నన్, కోశాధికారిగా గొడ్ల బాబురావు, ఉపాధ్యక్షులుగా ఇనపనూరి కుటుంబరావు, గొల్లమందల ప్రేమ్ కుమార్, సలహాదారులుగా నిర్మలరాజు, కాంపాటి రవి, ప్రచార కార్యదర్శిగా నారపోగు ప్రసాదు, సభ్యులుగా కొత్తపల్లి విజయ్, బోనాసి శ్రీనివాసరావులను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కార్డులు సకాలంలో అందించాలని కోరారు. తల్లాడ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని రాష్ట్ర నాయకులు రామ్ నారాయణ, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఏనుగు వెంకటేశ్వరావు ప్రత్యేకంగా అభినందించారు.
.
Aksharam Telugu Daily