Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కొత్తగూడెం : . భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / మార్చ్ 19/అక్షరం న్యూస్ -: గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్ట్కు భిన్నంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్ను ప్రవేశ పెట్టిందని, గతంలో అంకెల గారడీ స్పష్టంగా కనిపించగా ప్రస్తుత బడ్జెట్ వాస్తవానికి దగ్గరలో ఉందని, గత బడ్జెట్ కంటే 14,505 కోట్లు తగ్గుదలతో బడ్జెట్ ప్రెవేశపెట్టడం ఇందుకు నిదర్శనమని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. అసెంబ్లీలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సాబీర్ పాషా స్పందిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముందస్తు వ్యూహంలో భాగమేనన్నారు. ఆరు గ్యారంటీలకోసం 56 వేల కోట్లు కేటాయించడం ఆహ్వానించదగిందే అయినప్పటికీ ఆచరణ అనుమానమేనన్నారు. వ్యవసా రంగానికి బడ్జెట్ పెంచి సాగునీటి ప్రాజెట్లులకు కేవలం రూ.23 వేల కోట్లు మాత్రమే కేటాయించడం సరైంది కాదన్నారు. విద్య, వైద్య రంగాలకు, సంక్షేమ రంగానికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రము రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోందని, అప్పులు తెస్తేనే రాష్ట్రం నడిచే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఎస్సి, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించడం అభినందనీయమని, ఐతే వీరికి కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో ఖర్చుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా రంగాలకు కేటాయించిన బడ్జెట్లోని ప్రతి పైసా పూర్తి స్థాయిలో ఖర్చుచేస్తేనే ప్రజలు హర్షిస్తారని అన్నారు.
.
Aksharam Telugu Daily