D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : .. ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 14 (అక్షరంన్యూస్) సెంటర్ ఫర్ సైట్, విజయవాడ వారి ఆధ్వర్యంలో కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో డా: హరి ప్రసాద్ నేతృత్వంలో ఉచిత కంటి వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఆరోగ్య శిబిరాన్ని మాజీ జెడ్పిటిసి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ప్రారంభించి, కంటి పరీక్షలు చేయించుకున్నారు. దాదాపు 200 మంది ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ మానవ శరీరంలో కండ్లు ప్రధాన అవయవాలని, కళ్ల ను అశ్రద్ధ చేయకూడదని, మనం ఏ పని చేసినా కళ్ళు లేనిది చేయలేమని, ముఖ్యంగా షుగర్ వ్యాధి పీడితులు తరచుగా డాక్టర్ల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని, వారి సలహా మేరకు మందులు గాని, కళ్ళజోడు గాని వాడాలని సూచించారు. ముఖ్యంగా ఆహార విషయంలో శ్రద్ధ వహించాలని, ఆకుకూరలు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. ఆరోగ్య శిబిరంలో వందల మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లకు మరియు వారి సిబ్బందిని అభినందించి, ధన్యవాదాలు తెలుపుకున్నారు. డా. హరి ప్రసాద్ మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బయటకు వెళ్లి ఇంట్లోకి వచ్చిన వెంటనే కళ్ళను చన్నీటితో శుభ్రం చేసుకోవాలని, ముఖ్యంగా యువకులు సెల్ ఫోన్ల ను ఎక్కువగా చూడకూడదని, అవసరమైన మేరకే ఉపయోగించుకోవాలని, కంటిలో అతి సున్నితమైన రెటీనా పొర దెబ్బతినే అవకాశం ఉందని దీర్ఘకాలిక కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని, చాలా జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజేష్, మారుతి, సుదీర్ భానోతు నరసింహ నాయక్, శీలం పుల్లయ్య చల్ల మల్లయ్య, మేకల మల్లికార్జున్, పాటిబండ్ల ప్రసాదు జక్కంపూడి వెంకటేశ్వర్లు, మామిళ్ళ చిన్న నరసయ్య గుండ్ల వెంకన్న, బత్తుల వెంకన్న,రాయల నారాయణ మరియు తదితరులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily