D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ మార్చి 1 తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ రింగురోడ్డు కూడలిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి, గత సంవత్సర కాలంగా వాహన చోదకులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, బ్యాలెన్స్ తప్పి టూ వీలర్లు , రింగులో లారీలు పడిపోతున్నాయి, అయినా ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడం లేదని వాహన చోదకులు ఆరోపిస్తున్నారు. రోజు వేల సంఖ్యలో వాహన రాకపోకలు సాగిస్తుంటాయి, ఖమ్మం విశాఖపట్నం, భద్రాచలం నుండి ఖమ్మం వైపు వెళ్లే వాహనదారులు, కూడలిలో ఇబ్బందులకు గురవుతున్నారు, వాహనాలు వెళ్లే సమయంలో వచ్చే దుమ్ముతో, వాహనచోదకులు పరిసర దుకాణాల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, దుమ్ము వెదజల్లుతోంది, వాహనాలు వెళ్లే సమయంలో వచ్చే సమయంలో వాహనచోదకులు పాదచర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, పోలీసులు గ్రామపంచాయతీ వారు తాత్కాలిక మత్తులు చేయించారు అయినా ఎలాంటి ఫలితం లేదు, శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తులు నిర్వహించి వాహన చోదకులను ఇబ్బందుల నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily