Sunday, 15 March 2026 08:17:17 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అధ్వానంగా తల్లాడ రింగురోడ్డు రహదారి.. మోకాలు లోతు గుంటలతో వాహనదారులు ఇక్కట్లు.. మంత్రులు దృష్టి సారించాలని వేడుకోలు..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 29 August 2025 08:14 PM Views : 713

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ/ఆగస్టు/ 29 (అక్షరంన్యూస్) కొనిజర్ల, వైరా, తల్లాడ ప్రాంతాల్లో గుంతల మయంగా మారిన రహదారులు మా ప్రాణాలు కాపాడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్చేస్తున్న వాహన దారులు... రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేనివిధంగా ఖమ్మం జిల్లాలో ప్రధాన శాఖలైన ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. కానీ ..అందుకు విరుద్ధంగా రోడ్లన్నీ అద్వానంగా మారిపోయాయి. ప్రధాన నగరాలకు కూడలిగా ఉన్న తల్లాడ రింగ్ రోడ్డు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. వర్షాలతో పాటు స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో రింగురోడ్డు చుట్టూ ప్రమాదకరంగా మోకాల్లోతు గుంటలు పడ్డాయి. ఈ రోడ్డులో వాహనదారులు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ఆ గుంటల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులకు ఆ గుంతలు ఉన్నాయని తెలియక అందులో పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇంత జరుగుతున్నా మాత్రం స్థానిక అధికారులకు చీమకుట్టినట్టు కూడా లేదు. గతంలో ఎన్ని సార్లు ఈ రోడ్లపై అనేక కథనాలు వచ్చినప్పటికీ పట్టించుకున్న పాపాలు పోలేదు. జిల్లాకు లక్షలాది నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ తల్లాడ అధికారులు మాత్రం ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాగే ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దృష్టి సారించి తల్లాడ అధికారులపై చర్యలు తీసుకొని, ప్రధాన రహదారి రోడ్లకు మరమ్మత్తులు చేయించాలని ఈ ప్రాంత ప్రజలు మంత్రులను కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :