Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మార్చి 11 /తల్లాడ (అక్షరంన్యూస్)* సర్పంచ్ లేకపోవడంతో ఈవో, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పాలనపై దృష్టి సారించడం లేదని ప్రజల ఆరోపిస్తున్నారు, రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న గ్రిల్స్ ధ్వంసం అయ్యాయి, ఫౌంటెన్ ఏర్పాటు కోసం కొన్ని గ్రీల్స్ తొలగించారు. వాటిని తిరిగి ఏర్పాటు చేయలేదు, డివైడర్ల నిర్మాణానికి ఎమ్మెల్యేతో శంకుస్థాపన చేయించారు. ఈరోజు వరకు పనులు ప్రారంభించలేదు, నారాయణపురం వెళ్లే దారిలో వైన్ షాప్ దగ్గరలో ములుగునీరు నుంచి తటాకం ల మారింది, పందులు చేరి దుర్గంధం వెదజల్లుతుంది. ఎన్నిసార్లు ఈవో దృష్టికి తీసుకుని ఉన్న సమస్యలు పరిష్కరించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు, తాగునీరు ఎప్పుడు సరఫరా చేస్తారు ఎవరికీ అర్థం కాని పరిస్థితి, పంచాయతీ ఆవరణలో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వాటికి ఒక మనిషిని కేటాయించకపోవడం నిష్ప్రయోజనంగా మారాయి, ఎక్కడి చెత్త అక్కడే మురుగు కాలంలో మురుగు నిల్వ ఉంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు, అనారోగ్యం పాలవుతున్నారు, తడి చెత్త పొడి చెత్తకు రెండు ట్రాక్టర్లు ఉన్న వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు, ఎప్పుడు ట్రాక్టర్లు వస్తాయో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామని ప్రజలు వాపోతున్నారు, స్థానికంగా ఈవో ఉండకపోవడం ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు, ఓ మిత్రులతో గంటల తరబడి ముచ్చట్లు ఆడడం ప్రజల పట్ల నిర్లక్ష్య ధోరణి తో ప్రజలు విసుగు చెందారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని గ్రామపంచా సమస్యల పరిష్కరించాలని ప్రజల కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily