P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి నవంబర్ 10 (అక్షరం న్యూస్) జిల్లాలోని అతి పెద్ద. శైవ పుణ్యక్షేత్రమై అయినటువంటి. ఓదెల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీకమాసం ఏకాదశి తేదీ 15. 11. 2025. రోజున సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తున్నట్లు చైర్మన్ చీకట్ల మొండయ్య ఆలయ ఈవో బి సదయ్యతో పాటు కలిసి ఆదివారం సత్యనారాయణ వ్రతం కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మన ఓదెల గ్రామంలో హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న అటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివకేశవుల అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో మన భాగ్య విశేషం చేత భక్తుల కోరిక మేరకు ఈ సంవత్సరం నుండి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతమును జరిపించడానికి దేవస్థానం చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి నిర్ణయించడం జరిగిందని భక్తులందరూ ఇట్టి సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం లో పాల్గొని భగవత్ అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరారు అదేవిధంగా భక్తులు పూజా కార్యక్రమానికి పాటించవలసిన నియమాలు వ్రతంలో పాల్గొను దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనేవారు అరగంట. ముందుగా రావాలని అదేవిధంగా పూజ సామాగ్రి వ్రతంలో పాల్గొని భక్తులు తమ వెంట తెచ్చుకోవలసిన సామాగ్రి కలశం చెంబు రాగి లేక ఇతడిది అయినా పర్వాలేదు స్టీల్ ప్లేట్లు రెండు. స్టీల్ గిన్నెలు చిన్నవి. ఉద్దరిని చెంచే ఒకటి. కొబ్బరికాయలు 2 కొన్ని విడిపూలు మిగతా వ్రత సామాగ్రి ఆలయం నుండి సమకూర్చబడతాయని తెలిపారు ఈ వ్రతంలో పాల్గొనే జంటలు 500 రూపాయలు రుసుము చెల్లించి ముందుగా రసీదు తీసుకోవాలని కోరారు . సంప్రదించవలసిన నెంబర్లు. చీకట్ల మొండయ్య చైర్మన్ మొబైల్ నెంబర్ 9849 77 8526 ఎ. నరసింహ ఆచార్య 99 082 88 243 ఎం భూమయ్య రికార్డు అసిస్టెంట్ 96521 36 364 కు సంప్రదించి 500 రూపాయలు చెల్లించి రసీదు పొందవలసిందిగా చైర్మన్ చీకట్లో ముండయ్య తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బి సదయ్య జూనియర్ అసిస్టెంట్ ముదసాని కుమారస్వామి ధర్మకర్తలు ఉప్పల శ్రావణ్ కుమార్ తో పాటు ఒగ్గు పూజారులు సిబ్బంది పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily