D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మార్చి తల్లాడ/ 18 (అక్షరంన్యూస్)* నీటి ఎద్దడిని తీర్చాలని 12 సంవత్సరాల క్రితం 12 లక్షల రూపాయల వ్యయంతో ట్యాంకు నిర్మించారు, నీళ్లు వదిలితే పైపులు పగిలిపోతున్నాయని, నీటిని నింపటమే వదిలేశారు, గ్రామస్తులు ట్యాంక్ పూర్తయింది కదా తమ బాధలు తొలగిపోతాయని ఆశించారు వారి ఆశలు అడియాసలే అయ్యాయి, గత 12 ఏళ్లుగా నీటిని ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూడడమే వారికి మిగిలింది. గ్రామంలో రెండు బావులు ఉన్నాయి, ఒక భావిద్వారా గ్రామంలో నీటి సరఫరా జరిగేది భావి చుట్టూ కాంగ్రెస్ చేయడం తో నీటి జలలు తిరిగిపోయాయి, నీటి నిల్వ లేకుండా పోయింది, అధికారులు పర్సంటేజీ ల కోసం కాంక్రీట్ చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు, మరొక బావి ఉంది దాన్ని నిండా నీళ్లు ఉంటాయి కానీ ఆ బావికి మోటర్లు అమర్చి గ్రామంలో నీటిని సరఫరా చేయొచ్చు, కానీ గ్రామస్తులు ఎన్నిసార్లు మొత్తుకున్నా అధికారులు స్పందించడం లేదు ఆ బావికి మోటర్లు అమర్చి నీటిని సరఫరా చేయడం లేదు, ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బావికి మోటర్లు అమర్చి గ్రామంలో నీటి సరఫరా చేయాలని, వాటర్ ట్యాంక్ ద్వారా గ్రామస్తులకు నీళ్లు అందించాలని వేసవి ఎద్దడిని గుర్తించి ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily