Wednesday, 04 March 2026 01:40:29 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అమెరికా బిడ్డల ఆదరణ మరువలేను.. వద్దిరాజు మున్నూరు కాపుల ఘన సన్మానం..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 12 September 2025 09:09 PM Views : 430

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 12 (అక్షరంన్యూస్) ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తొలిసారిగా ఖమ్మం విచ్చేసిన రాజ్యసభ ఎంపీ ముద్దిరాజు రవిచంద్రను ఖమ్మం నగర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించుకున్నారు. స్థానిక బుర్హాన్ పురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆకుల గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మున్నూరు కాపు ప్రముఖులు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు ప్రముఖుల సమక్షంలో ఆయనను భారీ గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ఇటీవల తన అమెరికా పర్యటనలో అక్కడి మున్నూరు కాపు బిడ్డలు చూపిన ఆదరణ, ఆప్యాయత ఎన్నటికీ మరువలేనని అన్నారు. కొద్ది రోజుల తన పర్యటనలో అందర్నీ కలవలేకపోయినందుకు బాధపడుతున్నానని అన్నారు. అమెరికాలో స్థిరపడ్డ మున్నూరు కాపులంతా అక్కడ కమ్యూనిటీ అవసరాల కోసం భవనాలు నిర్మించాలని తాను చేసిన సూచనకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ తోపాటు అక్కడి కుల బంధువులు అందరూ ఆమోదించారని గుర్తు చేశారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా మున్నూరు కాపులంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన మున్నూరు కాపులు ఇతరులను గౌరవించడంలో ఎప్పుడు ముందుంటారని అన్నారు. బిసీ కులాల్లోని ఇతర సామాజిక వర్గాలను కలుపుకొని పోతూ మున్నూరు కాపు కులాన్ని కూడా బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు ప్రముఖులు మేకల భిక్షమయ్య, పారా నాగేశ్వరరావు, జాబిశెట్టి శ్రీనివాసరావు, కనకం జనార్ధన్, కార్పొరేటర్లు తోట రామారావు, శీలంశెట్టి వీరభద్రం, తోట వీరభద్రం, మాటేటి రామారావు, కాంగ్రెస్ నాయకులు పసుపులేటి వెంకట్ ,సిపిఐ నాయకులు మేకల శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మేకల నాగేందర్, బీఆర్ఎస్ నాయకులు పిన్ని కోటేశ్వరరావు, యాసా రామారావు, గుళ్లపల్లి శేషగిరిరావు, ఎర్రా అప్పారావు, యూత్ నాయకులు తోట రమేష్, వివిధ నియోజకవర్గాల బాధ్యులు, మాధురి మధు, మారిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :