Monday, 20 April 2026 05:38:34 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గిరిజన చిన్నారుల విద్యను బలోపేతం చేయాలి... ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి .రాహుల్..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 25 July 2025 04:34 PM Views : 548

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా /బూర్గంపాడు మండలం /సారపాక. అక్షరం న్యూస్/ జులై 25: గిరిజన చిన్నారుల విద్యను బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకొని పిల్లలు తెలుగు, ఇంగ్లీషులో రాసే పదాలు తప్పులు లేకుండా సక్రమంగా రాసేలా చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం నాడు బూర్గంపాడు మండలం సారపాక గ్రామపంచాయతీ పరిధిలోని భాస్కర్ నగర్, రాజీవ్ నగర్ గిరిజన సంక్షేమ శాఖ జిపిఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉపాధ్యాయుడి పాత్ర నిర్వహించి పిల్లల చేత బోర్డుపై అక్షరమాల మరియు వారి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఎలా రాయాలో పిల్లల చేత రాయించి పిల్లలు అడిగిన ప్రతి పదాలను బోర్డుపై రాయడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిపిఎస్ పాఠశాలలో చదివే పిల్లల యొక్క విద్యాభ్యాసం పునాది నుండి పటిష్టంగా ఉండేలా ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని చాలా వరకు పిల్లలు అందులోని పదాలు, కూడికలు, తీసివేతలు ఇతర వస్తువుల యొక్క పేర్లు అర్థం చేసుకొని రాయగలుగుతున్నారని, అయినా ఇంగ్లీషులోని పదాలు అక్కడక్కడ తప్పులు రాస్తున్నారని అందుకు అక్షరమాలకు సంబంధించిన అక్షరాలు పిల్లలందరూ తప్పులు లేకుండా రాసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లలకు నేర్పించాలని, సంబంధిత ఎస్ సి ఆర్ పి ల పర్యవేక్షణ సక్రమంగా ఉండాలని, ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు ఉపాధ్యాయులు పిల్లలకు బోధిస్తున్నది లేనిది గమనించాలని, పిల్లలకు ఏ విధంగా బోధిస్తున్నది పరిశీలించాలని అన్నారు. అలాగే ఉద్దీపకం వర్క్ బుక్స్-2 వర్క్ బుక్ ప్రతి జిపిఎస్ పాఠశాలకు పంపిణీ చేసినందున ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారికి బోధించి పిల్లలందరూ చదవడం రాయడం వచ్చే విధంగా చూడాలని అన్నారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఇంగ్లీషు గణితం కు సంబంధించిన ఉద్దీపకం వరకు బుక్స్-2 లోని అంశాలు పిల్లల చేత రాయించాలని అన్నారు. భాగ్యనగర్ జిపిఎస్ పాఠశాలలో 50 మంది పిల్లలు ఉన్న అక్కడ పనిచేస్తున్న టీచర్ రాజ్యలక్ష్మి ఎంతో క్రమశిక్షణగా పిల్లలకు ఉద్దీపకం వర్క్ బుక్ లోని పదాలు అర్థమయ్యే రీతిలో బోధించి పిల్లలు వర్క్ బుక్ లోని అంశాలు తప్పులు లేకుండా బోర్డుపై రాసి వాటి అర్ధాలు అనర్గళంగా చెప్పడంతో టీచర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి శ్రీదేవి మరియు ఉపాధ్యాయునిలు మంగమ్మ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :