P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జనవరి 14 (అక్షరం న్యూస్ ) ఓదెల గ్రామంలో సర్పంచ్ డాక్టర్ సతీష్ కనకిరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మహిళలందరికీ ముగ్గులపోటి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై దికొండ రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు ఎస్సై దికొండ రమేష్ కు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలు వేసే ముగ్గులు భారతదేశ అవనత్యాన్ని సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని నాటికి కులమత వర్ణ వర్గ భేదం ఉండదని ఇలా నిర్వహించుకునే పండగే సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు అనంతరం ముగ్గుల పోటీల్లో గెలిచిన విజేతలు కు బహుమతులు అందించారు బహుమతులు గెలుచుకున్న విజేతల పేర్లు మొదటి బహుమతి పేరo. అలేఖ్య ప్రెషర్ కుక్కర్ ద్వితీయ బహుమతి. రాంధేని సంధ్య. తాంబాలం సెట్ తృతీయ బహుమతి. చింతల సహస్ర. హాట్ ప్యాక్ మరియు ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేక ప్రతిభ చూపి నీటి పైన తేలియాడే ముగ్గువేసిన నగునూరి సహస్రకు స్పెషల్ ప్రైజ్ ఇచ్చి అభినందించడం జరిగింది.అలాగే ఇంటర్నేషనల్ కరాటే పోటీల్లో సెలెక్ట్ అయిన లగిశెట్టి శరణ్య, ఎంబాడీ. చoదన ను ఎస్సై మరియు సర్పంచ్ సతీష్ సన్మానించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని గ్రామానికి మంచి పేరుతేవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ గోపతి శ్రీలత ప్రవీణ్ వార్డ్ సభ్యులు బుద్ధే భాగ్యలక్ష్మి రవి, పెoడంలక్ష్మీ ఓదెలు,అప్పని తిరుపతి,చింతం తిరుపతి,ముద్దసానికిరణ్, దూలం సదానందం,రాపెల్లి రాజయ్య,రాచర్ల అశోక్, కొండ్ర లక్ష్మణ్,రాజారాం, చింతం స్వామిసిరిగిరి మరియు భువనగిరి రాజు, ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily