P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి 18 (అక్షరం న్యూస్ ) తాటి చెట్టు పైనుండి పడి గీతా కార్మికుడి మృతి చెందిన సంఘటన భీమరపల్లి గ్రామంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం దాదాపు 4 5 గంటల సమయంలో ఓదెల గ్రామానికి చెందిన ఐలు బిక్షపతి గౌడ్ వయసు దాదాపు 52 సంవత్సరాలు వృత్తి రిత్య భాగంగా. మండలంలోని భీమరపల్లి గ్రామ శివారులో తాటి చెట్టు ఎక్కుతూ ప్రమాదశాస్తు కిందపడి మృతి చెందాడని తెలిపారు గత 20 25 సంవత్సరాల నుండి గీత కార్మికుడిగా జీవితం కొనసాగిస్తూ జీవనం సాగిస్తుండని మృతి చెందిన బిక్షపతి గీత కార్మికుడికి ముగ్గురు ఆడపిల్లలు ఈ నేపథ్యంలో ఇద్దరికీ వివాహం చేయడం జరిగిందని చిన్న కూతురుకు మంచి సంబంధం చూసి వివాహం. చేయాలని చాలామందితో చర్చించేవాడని ఇంతలోనే ఇలాంటి దురదృష్ట సంఘటన జరిగిందని కుటుంబాన్ని పోషించే బిక్షపతి లేడని తెలిసినా కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని తండ్రి మృతితో ఆ కూతురు మృతుడి భార్య ఏడుస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది ఎవరికి ఎలాంటి కష్టం రాకుండా తాను ఒక్కడినే కష్టపడుతూ వృత్తిరీత్యా గీతా కార్మికుడిగా మంచి పేరున్న వ్యక్తి బిక్షపతి గౌడ్ అని పలువురు చర్చించుకుంటున్నారు బిక్షపతి గౌడ్ మృతితో ఓదెల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అందరితో కలివిడిగా తిరిగే వ్యక్తి ఒక్కసారిగా వికటజీవిగా కనబడడంతో పలువురు జీర్ణించుకోలేకపోయారు ఇప్పటిదాకా మాతో మాట్లాడి తాటి చెట్టు ఎక్కి దానిపై నుండి పడి మృతి చెందిన బిక్షపతి గౌడ్ ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన చాలామందిని కలిసి వేసింది చాలా మంచి వ్యక్తిని అలాంటి వ్యక్తికి ఇలాంటిది జరగడం దురదృష్టకరమని చాలామంది ఆవేదన గురయ్యారు వెంటనే ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకొని ఆర్థిక సాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు
.
Aksharam Telugu Daily