GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/డిసెంబర్-03(అక్షరం న్యూస్) మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ముస్తాబాద్ మండల లము లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎంపీడీఓ లచ్చాలు తెలిపారు. . ముస్తాబాద్ మండల వ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల నుండి నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు సిద్దం చేశామని అన్నారు. ఆయా పంచాయితీ కార్యాలయాల్లో అభ్యర్ధుల నుండి నామినేషన్ స్వీకరిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.5వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.మొదటి క్లస్టర్ గూడెం గ్రామం లో గూడెం, అవునూర్, తూర్కపల్లి రామలక్ష్మణ పల్లి, రెండొవ క్లస్టర్ నామపూర్ లో నామపూర్, గోపాలపల్లి, రాంరెడ్డి పల్లి, కొండాపూర్, మూడోవ క్లస్టర్ చీకోడ్ లో చీకోడ్, చిప్పల పల్లి, మొఱ్ఱయి పల్లి, నాలుగోవ క్లస్టర్ ముస్తాబాద్ లో ముస్తాబాద్, మోహిని కుంట, మద్దికుంట, ఐదోవ క్లస్టర్ బంధానకల్ లో బంధానకల్, వేంకట్రావు పల్లి, తెర్లుమద్ది, మొఱ్ఱపూర్, ఆరోవ క్లస్టర్ గా పోతుగల్ లో పోతుగల్, సేవాలాల్ తండా, గన్నేవారి పల్లి, గూడూరు,గ్రామాలు ఆయా పంచాయితీ కార్యాలయాల్లో అభ్యర్ధుల నుండి నామినేషన్ స్వీకరిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.బుధవారం ఉదయం 10.30 నిమిషాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుందని,సాయంత్రం 5గంటలకు పూర్తి అవుతుంది అని తెలిపారు. అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే స్వీకరణ కేంద్రంలోకి అనుమతిస్తారని తెలిపారు. నామినేషన కేంద్రాలకు 100మీటర్ల దూరంలో వాహనాలను నిలపాలని, సూచించారు.నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల పాటు నిషేధాజ్ఞలు అమలవుతాయన్నారు. నామినేషన్ ప్రక్రియ నాటి నుంచి45రోజుల లోపు అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు
.
Aksharam Telugu Daily