D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 4 (అక్షరం న్యూస్) కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో గల వివిధ డివిజన్ లలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్నాహక సమావేశములలో ముఖ్య అతిథిగా డిసిసి అధ్యక్షులు తోటా దేవి ప్రసన్నతో పాటు టిపిసిసి జనరల్ సెక్రెటరీ నాగాసీతారాములు పాల్గొన్నారు . ఈ సందర్భంగా నాగాసీతారాములు మాట్లాడుతూ త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కార్యకర్తలకు సూచిస్తూ , కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని,అందరం కలిసి సమిష్టిగా పనిచేసి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. . ఈ కార్యక్రమంలో సంవిధాన్ బచావ్ మెంబర్స్ జేబీ బాలశౌరి , ఏనుగుల అర్జున్ రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు నాయకులు తుళ్ళూరి. బ్రహ్మయ్య, ఆళ్ళ.మురళి, ఊకంటి. గోపాలరావు,నాగేంద్ర త్రివేది, ఐఎన్ టియుసి రజాక్, కనకరాజు, శ్రీనివాసరెడ్డికాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .
.
Aksharam Telugu Daily