GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా/రఘునాదపల్లి/( అక్షరం న్యూస్ ) సెప్టెంబరు 05: బ్యాంకు ఖాతాదారుల ఆదరాభిమానాలే ఉత్తమ విధి నిర్వహణకు నిదర్శనంగా నిలుస్తాయని పలువురు ఖాతాదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గా పని చేసిన మహ్మద్ షహబీర్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఖాతాదారులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఖాతాదారులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి బదిలీ సహజమని, వృత్తి నిర్వహణలో చేసిన సేవలు ఖాతాదారుల హృదయాలలో నిలిచిపోతాయని, బ్యాంకు మేనేజరుగా వహబీర్ ప్రజలకు మెరుగైన సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎండి రంజాన్, మహ్మద్ బాషమియా, బెల్దే శ్రీనివాస్, రాజేష్, బషీరుద్దీన్, రాజు, మహమ్మద్ నబి, దస్తగిరి, మహమ్మద్ యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily