AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 18 అక్షరం న్యూస్ న్యాయం చేయాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, నిందితులకే వత్తాసు పలికేందుకు సిద్ధమైన ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్‌ను కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. క్యాలెండర్‌లు చూడండి 2023లో ధర్మారం మండలం రచ్చపల్లిలో జరిగిన ఓ భూ వివాదం ఘర్షణకు దారితీసి,ఒకరి మృతికి కారణమైంది.ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ దశలో ఉంది.ఈ విచారణలో నిందితులకు అనుకూలంగా వ్యవహరించి, వారికి లబ్ధి చేకూరుస్తానని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ బేరం కుదుర్చుకున్నారు. ఇందుకోసం రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. వలపన్ని పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి.. లంచం వ్యవహారంపై సమాచారం అందుకున్న కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం పక్కా ప్రణాళికతో వల పన్నింది. ఒప్పందంలో భాగంగా బుధవారం బాధితుల నుంచి రవీందర్ రూ.1.50 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.నిందితుడి వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని,కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. న్యాయవ్యవస్థకు సంబంధించిన అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. లంచం తీసుకున్న నిందితుడిపై కేసు నమోదు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ మహేందర్ తెలిపారు
.
Aksharam Telugu Daily