AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : . పెద్దపల్లి అక్షరం ప్రతినిధి సెప్టెంబర్ 28 ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ఎన్నికల కమిషన్ తీరుకు నిరసనగా సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలంటూ వారి దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ విప్, శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ గతంలో పలుమార్లు అడ్డదారుల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ఈసారి సర్ ప్రోగ్రాం పేరిట తమకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఓట్ల తొలగింపుకు కుట్ర చేస్తుందని అన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయమై ఎన్నికల కమిషన్ తీరును ఎన్నోసార్లు గతంలో ప్రస్తావించినప్పటికీ కమిషన్ పనితీరులో మార్పు రాలేదని అన్నారు. స్వయంగా ఎన్నికల చీఫ్ కమిషనర్ వ్యవహార శైలి గురించి తోటి కమిషనర్లు వెల్లడించడంతో రాహుల్ గాంధీ విమర్శలు నిజమైనవని దేశం గుర్తించిందన్నారు. ఎన్నికల చీఫ్ కమిషనర్ చర్యల వల్ల దేశంలో 13 కోట్ల ఓట్లు గల్లంతు అయ్యే పరిస్థితి నెలకొందని ప్రభుత్వ విప్ విజయరమణ రావు విమర్శించారు. ఎన్నికల చీఫ్ కమిషనర్ ఇప్పటికైన విధుల నుండి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయి ఉండి బిజెపి అగ్రనేతల అడుగులకు మడుగులు ఒత్తడం దేశ చరిత్రలో ఇది తొలిసారి అని, దేశ ప్రజలంతా ఆయన చేష్టలను అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు అంతా గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా సర్ ప్రోగ్రాంపై చీఫ్ కమిషనర్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతిని ప్రభుత్వ విప్ విజయరమణ రావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు మరియు వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు మరియు పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్లు మరియు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily