AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 2/ అక్షరం న్యూస్ ---- దాతల ద్వారా అందివస్తున్న అవకాశాలను సద్వినియోగ పరుచుకోవాలని వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత అన్నారు. చర్ల కు చెందిన బంగారం దుకాణం యజమాని గాదంశెట్టి నరసింహారావు తన మాతృమూర్తి గాందశెట్టి చెంచులక్ష్మి వర్దంతి సందర్భంగా వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం కు 50 కేజీల బియ్యం వితరణ గా అందచేసి నిలయ విద్యార్థులకు ఒకపూట భోజనం పండ్లను పంపిణీ చేసారు. దాతలు గత కొద్ది సంవత్సరములు గా గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కోసం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నారు.దాతలకు నిలయ కమిటీ సభ్యులు హృదయ పూర్వకమైన కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు.అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆశాలత మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతి కొరకు దాతలు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. పేద విద్యార్దుల చదువుల కొరకు వారికి బంగారు భవిష్యత్ అందచేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతుగా సహకారం అందించడం నిలయ కమిటీలో ఉత్సాహం నింపుతోందని వెల్లడించారు. విద్యార్దులు దాతల నమ్మకాన్ని వమ్ముచేయకుండా క్రమశిక్షణతో చదివి సంస్ద తో పాటు తల్లిదండ్రులు గ్రామానికి పేరుప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. విద్యార్ది దశలో కష్డపడితే జీవితాంతం సుఖపడతారన్న విషయాన్ని గమనంలో కి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily