D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 5 తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరరావుఅధ్వర్యంలో సోమవారం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జన్మదినోత్సవం సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ నందు విద్యార్థులకు స్నాక్స్ (అల్పాహారం) వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ దారా శ్రీనివాసరావు , డిస్టిక్ కో ఆర్డినేటర్ కర్నాటి లక్ష్మారెడ్డి, మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అంగర్ రిలీఫ్ వీక్ గా ప్రకటించి ఈ వారం రోజులు ప్రతిరోజు అన్న ప్రసాదం వితరణ చేయాలని నిర్ణయించారు. మూడవ రోజు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ తల్లాడ నందు విద్యార్థిని విద్యార్థులకు అల్పాహారం వితరణ చేస్తామని తెలిపారు . డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ ధారా శ్రీనివాసరావు స్పాన్సర్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసి వెంకటనారాయణ రెడ్డి, ట్రెజరర్ అనుమోలు సర్వేశ్వరరావు మాజీ సెక్రటరీ కటికి వెంకటేశ్వరరావు, తోట మురళి, హెచ్ఎం ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily