D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 14 (అక్షరంన్యూస్) తిరుమలాయపాలెం : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచనల మేరకు పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తిరుమలాయపాలెం మండల పరిధిలో ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు మరణించిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆదివారం ఆర్థిక సాయం అందజేసింది. తిరుమలాయపాలెం, పిండిప్రోలు, తెట్టెలపాడు, కేశవాపురం, అజ్మీర్ తండా, హైదర్ సాయిపేట, జోగులపాడు, చంద్రు తండా, పాతర్లపాడు, దమ్మాయిగూడెం, ఏలూవారిగూడెం, బీరోలు, బచ్చోడు, బచ్చోడు తండా, జూపేడ, సోలీపురం, కాకరవాయి, సుద్దవాగు తండా, రఘునాధపాలెం, హస్నాబాద్, సుబ్లేడు, ఇస్లావత్ తండా, మహ్మదాపురం, మేడిదపల్లి, తాళ్లచెర్వు, ఎర్రగడ్డ, కొక్కిరేణి గ్రామాల్లోని 70 కుటుంబాలకు ఈ సాయం అందజేయబడింది. కష్టకాలంలో పేదలకు అండగా నిలిచే ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily